NRML: నిర్మల్ ఎన్.టీ.ఆర్ మినీ స్టేడియంలో శనివారం నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడా పాఠశాల ఎంపిక పోటీల్లో సుమారు 60 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీవైఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.