KMM: కూసుమంచి మండలంలోని పాలేరు శ్రీ వెంకటలక్ష్మి ఫర్టిలైజర్స్లో 555 బస్తాల యూరియా అందుబాటులో ఉన్నట్లు ఏవో వాణి సోమవారం తెలిపారు. రైతులు ఎరువుల కోసం ఆందోళన చెందవద్దని యూరియా యాప్ ద్వారా బుక్ చేసుకోవాలని ఆమె సూచించారు. మండలంలో సరిపడా నిల్వలు ఉన్నాయని అర్హులైన రైతులందరికీ ఎరువులు అందుతాయని ఆమె అన్నారు.