KNR: ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో డ్రగ్స్ నియంత్రణపై కరీంనగర్లో శనివారం కెమిస్టు భవన్ నుంచి అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఔషధాల దుర్వినియోగం, నియంత్రణ, క్యూ ఆర్ కోడ్ వెరిఫికేషన్, లైసెన్స్ వెరిఫికేషన్, నిషేధిత మత్తు పదార్థాలపై అవగాహన కల్పించారు.