NLG: దేవరకొండ మండలం సూర్యతండా పరిధిలోని మాన్య బావోజి తండాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ కార్యకర్త జేమ్లా నాయక్ మృతి బాధాకరమని ఎమ్మెల్యే బాలునాయక్ అన్నారు. బుధవారం ఆయన పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి మనో ధైర్యం చెప్పారు. జేమ్లా నాయక్ మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని అన్నారు.