NZB: పోలీస్ కమిషనరేట్లో CP సాయి చైతన్య మంగళవారం అగ్నిమాపక వారోత్సవాలకు సంబంధించిన గోడ పత్రికలు కరపత్రాలను ఆవిష్కరించారు. జిల్లా అగ్నిమాపక అధికారి టీ.పరమేశ్వర్ మాట్లాడుతూ.. ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 20 వరకు ఈ వారోత్సవాలు కొనసాగుతాయని వెల్లడించారు. వారం రోజుల పాటు అగ్ని ప్రమాదాల పట్ల అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.