మంచిర్యాల: బెల్లంపల్లి పట్టణంలో ప్రభుత్వ గురుకులాల్లో ఐదు నుంచి తొమ్మిదవ తరగతి వరకు ఉన్న బ్యాక్లాగ్ సీట్ల భర్తీకి ఆదివారం నిర్వహిస్తున్న పరీక్ష ప్రారంభమైంది. బెల్లంపల్లిలో మొత్తం నాలుగు పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటలకు విద్యార్థులు తమ తమ హాల్ టికెట్లతో పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకున్నారు.