PDPL: సింగరేణికి రావాల్సిన రూ. 50 వేల కోట్ల బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ నేతలు మడ్డి ఎల్లా గౌడ్, కవ్వంపల్లి స్వామి డిమాండ్ చేశారు. ఆర్జీ-1 ఏరియా గనుల వద్ద ధర్నా చేపట్టి, ఏప్రిల్లో సమ్మె నోటీసు ఇస్తామని హెచ్చరించారు. మెడికల్ బోర్డు నిర్వహించాలని, ఇన్కమ్ టాక్స్ భారం యాజమాన్యమే భరించాలని కోరారు. ఈ మేరకు ‘సేవ్ సింగరేణి’ పేరుతో సమ్మె నిర్వహిస్తామన్నారు.