MDCL: ప్రేమ వివాహం చేసుకున్నాడన్న కోపంతో యువకుడిపై కొందరు దుండగులు దాడి చేశారు. నేరెడ్‌మెట్‌కు చెందిన అజయ్‌ను రామలింగంపల్లి గ్రామ శివార్‌కు పిలిపించి యువతి సోదరుడు, అతని స్నేహితులు కారం చల్లి కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అజయ్‌ను పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు.