BDK: మణుగూరు మండల కేంద్రంలో రెడ్డి కళ్యాణ మండపం నిర్మాణానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇవాళ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజలను సమన్యాయంగా చూసే ఏకైక ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.