NRPT: మద్దూరు మున్సిపాలిటీలో అన్ని వార్డులలో “99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమం కౌన్సిలర్లు ఘనంగా నిర్వహించారు. అధికారులు ప్రజల మధ్యకు వెళ్లి సమస్యలను తెలుసుకున్నారు. నీటి కొరత, శానిటేషన్, రోడ్ల పరిస్థితి అంశాలపై ప్రజల అభిప్రాయాలను స్వీకరించారు. ప్రభుత్వ సేవలను ప్రజల గడపదాకా తీసుకెళ్లడమే లక్ష్యంగా కొనసాగుతోందని వారు తెలిపారు.