MNCL: వేసవికాలంలో నీటి ఎద్దడి ఏర్పడకుండా పాడైన బోర్లకు మరమ్మతులు చేయిస్తున్నామని లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు కౌన్సిలర్ రాజు తెలిపారు. శుక్రవారం వార్డులోని పలు కాలనీలలో పనిచేయని బోర్లను ఆయన పరిశీలించారు. అనంతరం మున్సిపల్ కార్మికులు, బోరు మెకానిక్‌లతో బోర్లను బాగు చేయించారు. వార్డులో సమస్యలు ఉంటే తనకు తెలపాలని, వాటిని పరిష్కరిస్తానన్నారు.