SRCL: విద్యుత్ వినియోగదారులకు సేవలు మరింత సులభతరం చేసేందుకు వాట్స్అప్ సేవలు అందుబాటులోకి తెచ్చామని సిరిసిల్ల ఎండీ బిక్షపతి తెలిపారు. సిరిసిల్లలోని సెస్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. వాట్సాప్‌లో 7901628348 నంబర్‌కు హాయ్ అని మెసేజ్ పంపి ఆన్లైన్లో ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చన్నారు. అలాగే అత్యవసర పరిస్థితుల్లో టోల్ ఫ్రీ నెంబర్ 1912కు ఫోన్ చేయాలన్నారు.