NRML: మున్సిపాలిటీల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని మాజీ మున్సిపల్ ఛైర్మన్ రాజుర సత్యం అన్నారు. ఖానాపూర్ పట్టణంలోని జేకే నగర్లో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులను ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు ఆయన బుధవారం పరిశీలించారు. అనంతరం సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్మించాలని సూచించారు.