KMM: హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో తెలంగాణ వ్యవసాయ శాఖ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా మెగా రైతు మేళా నిర్వహించింది. ఈ మేళాలో ఖమ్మం జిల్లాకు చెందిన రైతు సంఘం నాయకుడు నల్లమల వెంకటేశ్వరరావు ఉత్తమ రైతు అవార్డు అందుకున్నారు. వ్యవసాయ రంగంలో ఆయన చేస్తున్న కృషిని గుర్తిస్తూ మేళా ముగింపు వేడుకలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందజేశారు.