NGKL: కోడేరు మండలం నాగులపల్లి గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆదివారం గ్రామపంచాయతీ సిబ్బందిని సర్పంచ్ సరిత జగన్మోహన్ రెడ్డి, ఉప సర్పంచ్ సాయిలీల, పాలకవర్గ సభ్యులతో కలిసి ఘనంగా సన్మానించారు. గ్రామపంచాయతీ సిబ్బందికి హ్యాండ్ వాష్, సోపు ఆయిల్ పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ.. 99 రోజుల ప్రగతి ప్రణాళికల అభివృద్ధిలో జీపీ సిబ్బంది పాత్ర కీలకమని తెలిపారు.