NZB: కోర్టు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆర్మూరు సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి అధికారులను ఆదేశించారు. ఇవాళ భీంగల్ పట్టణ కేంద్రంలో నిర్మాణంలో ఉన్న కోర్టు పనులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనులను ఆమె ఎంపీడీవో సంతోష్ ను అడిగి తెలుసుకున్నారు. పనులలో వేగం పెంచి త్వరితగతిన ఉపయోగంలోకి తీసుకురావాలని సూచించారు.