KMM: జిల్లాలోని సాగర్ ఆయకట్టు పరిధిలో సాగవుతున్న పంటల అవసరాలు తీరేవరకు నీటిని అధికారులు సరఫరా చేయనున్నారు. ముందస్తు షెడ్యూల్ మేరకు 7వ తేదీ నుంచి నీటి సరఫరా నిలిపేయాలని నీటిపారుదల శాఖ అధికారులు భావించారు. మంత్రి తుమ్మల ఈ నీటి సరఫరాపై ఆరా తీశారు. కానీ రైతులు ఈ నెల 20 వరకు సాగునీరివ్వాలని కోరుతున్నారు.