ASF: కాగజ్ నగర్ మండలం ఈజ్ గాం శాంతినికేతన్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన SSC పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ హరిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు. విద్యార్థులకు తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలు సక్రమంగా ఉండాలన్నారు. అక్రమాలకు తావులేకుండా పర్యవేక్షణ కట్టుదిట్టం చేయాలని సూచించారు.