KNR: వీణవంక మండల పరిధిలోని రహదారులపై వరి ధాన్యం, మొక్కజొన్న ఆరబెట్టకూడదని పోలీసులు ఇది వరకే రైతులకు అవగాహన కల్పించారు. అయితే ఇప్పటికీ ఆరబెట్టిన ధాన్యాన్ని తొలగించకపోవడంతో రైతులకు పలు సూచనలు చేశారు. కానీ రోడ్డు ప్రమాదాల దృష్ట్యా గ్రామాల్లో ఖాళీ ప్రదేశాలను గుర్తించి ధాన్యం ఆరబెట్టడానికి వాడుకోవాలని సూచించారు. లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.