MDK: ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఎస్సై రాజేష్ సూచించారు. సోమవారం నందగోకుల్ గ్రామంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ గ్రామాన్ని ప్రత్యేకంగా ఎంపిక చేశామని, ఉన్నతాధికారులతో కలిసి గ్రామస్తులకు మరిన్ని సూచనలు చేస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించి సురక్షితంగా ఉండాలని కోరారు.