NZB: బదిలీపై వెళ్తున్న అదనపు డీసీపీ(అడ్మిన్)బస్వా రెడ్డిని NZB సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిన్న సాయంత్రం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య.. బస్వా రెడ్డి సేవలను కొనియాడారు. శాంతిభద్రతల పరిరక్షణకు, శాఖాపరమైన విధుల్లో ఆయన ఎంతో కృషి చేశారని ప్రశంసించారు. అనంతరం శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.