ఆదిలాబాద్ గ్రామీణ మండలంలోని చాందా-టీ గ్రామంలో ప్రధాన మంత్రి ఉపాధి సృష్టి కార్యక్రమం (PMEGP) కింద ఏర్పాటు చేసిన సాయి వినాయక ఇండస్ట్రీస్ యూనిట్‌ను కలెక్టర్ రాజర్షి షా మంగళవారం ప్రారంభించారు. నిరుద్యోగ యువత స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను విస్తరించడంలో కీలక పాత్ర పోషిస్తాయని కలెక్టర్ తెలిపారు.