నిర్మల్ నియోజకవర్గంలో అన్ని మండలాల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు మంజూరైనట్లు MLA మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఇదివరకే నిర్మల్, సారంగాపూర్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామన్నారు. సంబంధిత మంత్రితో మాట్లాడటంతో కొత్తగా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు.