NZB: చందూర్ గ్రామ పంచాయతీ పాలకవర్గం కీలక నిర్ణయం తీసుకున్నారు. పిల్లల ఆరోగ్య సంరక్షణకు తమ గ్రామంలో ఐస్ క్రీమ్ ఆటోలకు, ఐస్ క్రీమ్ బండ్లకు ప్రవేశం లేదని శనివారం ఫ్లెక్సీ ఏర్పాటు చేయించారు. గ్రామానికి వచ్చి ఐస్ క్రీమ్ అమ్మితే రూ. 5,000 జరిమానా విధిస్తామని చందూర్ గ్రామ పంచాయతీ పాలకవర్గం తెలిపింది. పిల్లల సంరక్షణకు అందరూ సహకరించాలని పాలకవర్గం కోరింది.