GDWL: జిల్లా కేంద్రం నుంచి అదృశ్యమైన మైనర్ బాలిక రుత్విక ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. పోలీసులు జరిపిన గాలింపు చర్యల్లో భాగంగా రుత్విక హైదరాబాద్లోని అఫ్జల్ గంజ్ బస్టాప్ వద్ద ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం బాలిక పోలీసుల ఆధీనంలో ఉన్నట్లు సమాచారం అందుతోంది. గత కొద్దిరోజులుగా ఆందోళనలో ఉన్న కుటుంబ సభ్యులకు రుత్విక సురక్షితంగా ఉన్నట్లు తెలిసింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.