BHNG: చౌటుప్పల్ నేషనల్ హైవే-65 విస్తరణలో భాగంగా బస్టాండ్ ఎదురుగా ఓపెన్ ఫ్లైఓవర్ బ్రిడ్జిని నిర్మించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ డిమాండ్ చేశారు. గురువారం చౌటుప్పల్ పట్టణంలోని కందాల రంగారెడ్డి స్మారక భవనంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.