HYD: తెలంగాణలో ప్రతి ఏటా సుమారు 55 నుంచి 60 వేల క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. మహిళల్లో కనిపించే క్యాన్సర్లలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లో రెండో స్థానంలో ఉందని, రాష్ట్రంలో ఏటా దాదాపు 3,200 మందిని ప్రభావితం చేస్తున్నట్లు HYD MNJ క్యాన్సర్ హాస్పిటల్ టీం తెలిపింది. ఈ నేపధ్యంలోనే HPV వాక్సినేషన్ ప్రారంభించారు. అయితే, మొదటి స్థానంలో బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది.