NRPT: ఊట్కూర్ మండలంలోని మగ్దంపూర్, నిడుగుర్తి, పెద్ద జట్రం గ్రామాల్లో మేరా యువ భారత్ ఆధ్వర్యంలో యువ మండల్ వికాస్ అభియాన్ నిర్వహించారు. యువజన సంఘాలకు వాలీబాల్, ఫుట్బాల్, హ్యాండ్బాల్, స్కిప్పింగ్ క్రీడా సామగ్రిని పంపిణీ చేశారు. క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఐక్యత పెంపొందిస్తాయని జిల్లా కోఆర్డినేటర్ అనిల్ కుమార్ గౌడ్ తెలిపారు.