KNR: మానకొండూర్ మండలం ఈదులగట్టెపల్లికి సర్వీస్ రోడ్డు లేకపోవడంపై జిల్లా అధికారులు శనివారం విచారణ చేపట్టారు. కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశాలతో జడ్పీ సీఈవో శ్రీనివాస్, డిప్యూటీ సీఈవో పవన్ కుమార్ గ్రామాన్ని సందర్శించి సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి వివరాలు సేకరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో వరలక్ష్మి, తహసీల్దార్ విజయ్, సర్పంచ్ పాల్గొన్నారు.