VKB: ఎండలను మించి నిమ్మకాయల ధరలు మండిపోతున్నాయి. పరిగి మున్సిపల్ మార్కెట్లో ఇవాళ 50 KGల నిమ్మకాయల బస్తా ఏకంగా రూ. 9 వేలు పలుకుతోంది. గతవారం KG రూ.130-రూ.150 ఉండగా, ఇప్పుడు సుమారు రూ. 180 నుంచి రూ. 200కు చేరింది. ఈ ఎండలకు ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు ఎక్కువగా నిమ్మరసాలపై ఆధారపడటంతో వాటికి డిమాండ్ పెరిగినట్లు పలువురు వ్యాపారులు చెబుతున్నారు.