SRD: మండల కేంద్రమైన కంగ్టిలో నిర్వహించిన సెన్సస్ శిక్షణ కార్యక్రమం మంగళవారం ముగిసింది. సెన్సస్ 2027లో భాగంగా గత మూడు రోజుల నుంచి ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించారు. ట్రైనర్లు రహీం, సంగు శెట్టి 48 మందికి జనాభా లెక్కల ప్రక్రియలో భాగంగా తొలుత ఇండ్ల గణన కోసం చేపట్టాల్సిన సర్వే ప్రక్రియపై ఇచ్చిన శిక్షణ విజయవంతంగా ముగిసింది.