RR: రంజాన్ నమాజ్‌కు ముస్లిం సోదరులకు ఇబ్బందులు లేకుండా, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జ్, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. పహాడీషరీఫ్ దర్గా దగ్గర ఉన్న ఈద్గాను ఈరోజు పరిశీలించారు. వెంటనే శుభ్రం చేయాలని, నమాజ్‌కు వచ్చే ముస్లిం సోదరులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశించారు.