JGL: సమాజంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం ఎన్ని చట్టాలు తెచ్చినా, క్షేత్రస్థాయిలో అవగాహన ఉన్నప్పుడే మార్పు సాధ్యమవుతుందని సఖీ కేంద్రం ఆధ్వర్యంలో బీరుసానిలో అవగాహాన సదస్సు నిర్వహించారు. గృహహింస వేదింపులకు గురయ్యే మహిళలు భయపడకుండా ముందుకురావాలని, అత్యవసర సమయాల్లో 181 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.