SDPT: ప్రభుత్వం రైతు భరోసా సహాయం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నంగునూరు మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో MLC, ప్రముఖ గాయకుడు దేశపతి శ్రీనివాస్, సామాజిక విశ్లేషకులు పాపారావు పాల్గొన్నారు. పంట పొలాల్లో ఉండాల్సిన రైతులు రోడ్లపై ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.