ASF: ఆసిఫాబాద్ డిపోలో RTC ప్రైవేట్ హైర్ బస్ డ్రైవర్స్ యూనియన్ (AITUC) సమావేశం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ మాట్లాడుతూ.. ప్రైవేట్ హైర్ బస్ డ్రైవర్లను RTC యాజమాన్యం శ్రమదోపిడికి గురిచేస్తోందని ఆరోపించారు. సమాన పనికి సమాన వేతనం, కనీస వేతనం రూ.26,000 ESI, EPF బోనస్, 8 గంటల పని విధానం అమలు చేయాలన్నారు.