PLD: సత్తెనపల్లి ఇంటర్ జవాబు పత్రాల స్పాట్ వాల్యుయేషన్ తేదీలో మార్పు జరిగినట్లు జిల్లా డీఈవో నీలావతి దేవి తెలిపారు. మార్చి 21కి బదులుగా మార్చి 22 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. డ్యూటీ ఆర్డర్స్ ఉన్న లెక్చరర్లు, ప్రిన్సిపాల్స్ 22న ఉదయం 10 గంటలకు సత్తెనపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు హాజరు కావాలని ఆమె సూచించారు.