BDK: జిల్లాలో ప్రభుత్వ వైద్యరంగం మరో కీలక మైలురాయిని అధిగమించింది. జిల్లా వ్యాప్తంగా అన్ని ఏజెన్సీ ఆసుపత్రుల్లో రేడియాలజిస్టులను నియమించి, TIFFA స్కాన్ అత్యాధునిక స్కానింగ్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చి భద్రాద్రి వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులు నూతన రికార్డును నెలకొల్పాయి. గిరిజన ప్రాంతాల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యం ఫలిస్తున్నాయి.