MLG: మున్సిపాలిటీలో ఇవాళ DYFI మండల అధ్యక్షులు రాజు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుధ్యం, వీధి లైట్ల సమస్యలు తీవ్రంగా ఉన్నాయని అన్నారు. ప్రజలు ప్రాథమిక సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారులు తక్షణం స్పందించి సమస్యలు పరిష్కరించాలన్నారు.