SDPT: వర్గల్ మండలం చౌదర్పల్లిలోని బంధం చెరువు అధికారుల నిర్లక్ష్యంతో ప్రమాదకరంగా మారింది. కొండపోచమ్మ సాగర్ నీటి ఉధృతికి చెరువు మత్తడి కొట్టుకుపోవడంతో, 50 శాతం నీరు వృథాగా పోతోంది. మరమ్మతుల కోసం నిధులు మంజూరైనప్పటికీ పనులు ప్రారంభించకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.