TPT: తిరుపతి శ్రీ కోదండరామస్వామి ఆలయంలో మే నెలలో పలు విశేష ఉత్సవాలు నిర్వహించనున్నారు. పౌర్ణమి రోజుల్లో అష్టోత్తర శతకలశాభిషేకం, శనివారాల్లో అభిషేకాలు, ఊరేగింపులు, ఊంజల్ సేవలు ఉంటాయని ఆలయ అధికారులు తెలిపారు . మే 12న హనుమన్ జయంతి, 16న అమావాస్య సందర్భంగా సహస్ర కలశాభిషేకం, హనుమంత వాహనసేవ, 21న సీతారాముల కల్యాణం నిర్వహించనున్నారు.