KNR: జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సెన్సెస్-2027 గృహ గణన శిక్షణ తరగతులు శనివారం ప్రారంభమయ్యా యి. రూరల్ ప్రాంత ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు మూడు రోజుల పాటు ఈ శిక్షణ ఇవ్వనున్నారు. ఎంఈవో హేమలత హాజరై గణనలో పాటించాల్సిన విధానాలపై అవగాహన కల్పించారు. ప్రతి ఇంటి సమాచారాన్ని పక్కాగా సేకరించాలని సూచించారు.