RR: జిల్లా పరిధిలో సోలార్ విద్యుత్ వినియోగాన్ని పెంచేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. రాజేంద్రనగర్, ఎల్బీనగర్, మహేశ్వరం ప్రాంతాల్లో అమలుకు చర్యలు ప్రారంభమైనట్లు రెడ్కో మేనేజర్ వేణుగోపాల్ తెలిపారు. గృహాలు, సంస్థల్లో సౌర ప్యానెల్స్ ఏర్పాటు ప్రోత్సహిస్తూ పీఎం సూర్యఘర్ పథకం ద్వారా సబ్సిడీలకు pmsuryaghar.gov.in చెక్ చేయాలన్నారు.