NLG: ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో చండూరుకు చెందిన భూతరాజు చంద్రస్మిత అద్భుత ప్రతిభ కనబరిచింది. చౌటుప్పల్ టీజీఆర్ఎస్ జూనియర్ కాలేజీలో చదువుతున్న ఆమె 1000 మార్కులకు గాను 988 మార్కులు సాధించి సత్తా చాటింది. ఈ సందర్భంగా ఆమెను కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, స్నేహితులు ఘనంగా అభినందించారు.