ఖమ్మం జిల్లాలో జరుగుతున్న ఇంటర్ పరీక్షల్లో ఫస్టియర్ ఆంగ్ల పరీక్షలో అసలు విద్యార్థికి బదులుగా మరొక యువకుడు పరీక్ష రాస్తూ ఇన్విజిలేటర్లకు అడ్డంగా దొరికిపోయాడు. ఓఎంఆర్ షీట్‌పై సంతకం చేయించుకునే సమయంలో చేతిరాత సంతకంలో తేడా ఉండటంతో అసలు విషయం బయటపడింది. నిందితుడిని వెంటనే పట్టుకుని పోలీసులకు అప్పగించినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి రవిబాబు తెలిపారు.