KMM: అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఆటో డ్రైవర్ బూరెల శ్రీనివాసరావుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సిఫారసుతో మంజూరైన రూ.26 వేల చెక్కును బుధవారం అందజేశారు. ఖమ్మం కాంగ్రెస్ ఆఫీస్ అడ్డా వద్ద జరిగిన కార్యక్రమంలో ఐఎన్టీయూసీ నేతలు పాల్వంచ కృష్ణ, లక్ష్మీనారాయణ లబ్ధిదారుడికి ఈ చెక్కును పంపిణీ చేశారు. ఆపదలో ఉన్న కార్మికుడిని ఆదుకున్న మంత్రికి వారు ధన్యవాదాలు తెలిపారు.