SRPT: సమ్మర్ యాపిల్‌గా పేరొందిన తాటి తాటిముంజెల వ్యాపారం జిల్లాలో జోరుగా సాగుతోంది. కోదాడ, హుజూర్ నగర్, నేరేడుచర్ల, తుంగతుర్తి, తదితర ప్రాంతాల్లో విస్తారంగా ఉన్న తాటి తోపులు వందలాది కుటుంబాలకు ఉపాధినిస్తున్నాయి. ప్రస్తుతం డజను ముంజెల ధర రూ.70 పలుకుతోంది. ఎండల దృష్ట్యా ముంజలకు మార్కెట్లో భారీ డిమాండ్ ఏర్పడిందని విక్రయదారులు చెబుతున్నారు.