SRD: రామచంద్రపురంలో బీహెచ్ఈఎల్ భూముల వివాదాలపై ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్పందించారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని యాజమాన్యానికి సూచించారు. బీరప్ప గుడి పునర్నిర్మాణం, రాయసముద్రం చెరువు సుందరీకరణ, స్మశానాల వినియోగంపై అడ్డంకులు తొలగించాలని కోరారు. ప్రజా సంక్షేమ పనులు అడ్డుకుంటే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు.