HNK: నడికూడ మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని కాసేపు క్రికెట్ ఆడి సందడి చేశారు. అనంతరం టోర్నమెంటులో గెలుపొందిన విజేతలకు ఎమ్మెల్సీ బహుమతులను అందజేశారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని, విద్యార్థులు, యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని ఎమ్మెల్సీ అన్నారు.