MDK: అల్లాదుర్గంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ముప్పారం గ్రామానికి చెందిన సనుబాల వీరేశం(41) పని నిమిత్తం అల్లాదుర్గం వచ్చి, తిరిగి తన బైక్పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు అదుపుతప్పి కిందపడిపోయారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన అక్కడ చికిత్స పొందుతున్నారు.