KMR: పంట భూముల భూసార సంరక్షణ, భూసార పరీక్షల ఆవశ్యకతపై రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి వారిలో చైతన్యం తెచ్చేందుకు గాను వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తోంది. ఇందులో భాగంగా భూసార సంరక్షణకు గాను ప్రతి రెవెన్యూ గ్రామానికి ముగ్గురు చొప్పున వాలంటీర్లను నియమించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వారి ఎంపిక కోసం ఇప్పటికే జిల్లాలో కసరత్తు మొదలైంది.